అమరావతిని రాజధానిగా కొనసాగించాలి సిపిఐ

అమరావతిని రాజధానిగా కొనసాగించాలి సిపిఐ
యర్రగొండపాలెం అక్టోబర్ 12 (న్యూస్ మేట్) : 12/10/20అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సిపిఐ సీనియర్ నాయకులు టి సి హెచ్ చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత 29 గ్రామాల రైతులు నిరసన నేటికీ 300 రోజులు పూర్తయిన సందర్భంగా వారికి సంపూర్ణ సంఘీభావంగా సోమవారం యర్రగొండపాలెం లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహాశీల్దార్ నెహ్రూ బాబు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రంనకు రాజధాని లేదన్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించబడి శంకుస్థాపన చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ పార్టీ కూడా ఆమోదించింది అన్నారు. నేడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధానుల ప్రతిపాదనను వేగంగా అమలు చేయుటకు పూనుకుందన్నారు. 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చి 13 జిల్లాల అభివృద్ధిని కాంక్షించిన రైతుల దీక్షలు న్యాయబద్ధమైనవని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రాజధానులు ప్రతిపాదనను విరమించుకోని, అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కే గురవయ్య, సీపీఐ నాయకులు ఎం సాంబశివరావు, నక్కా తిరుపతయ్య, ఎం వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు షేక్ జిలాని, కె. వెంకటేశ్వర్లు, మంత్రు నాయక్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *