వైయస్సార్ ఉచిత విద్యుత్ పథకం రైతులకు ఎంతో ప్రయోజనం
లింగసముద్రం అక్టోబర్ 15 (న్యూస్ మేట్): వైయస్సార్ రైతు ఉచిత విద్యుత్ పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీడీవో . కే. మాలకొండయ్య అన్నారు. గురువారం ఎంపిడిఓ కార్యాలయంలో వైఎస్ఆర్ రైతు ఉచిత విద్యుత్ కు సంబంధించి పోస్టర్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ వైయస్సార్ రైతు ఉచిత విద్యుత్ పథకం వలన ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాకే నగదు బదిలీ చేస్తుందని ఆ నగదును రైతు నేరుగా ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాఘవేంద్ర, మండల వ్యవసాయ అధికారి బి.రవికుమార్ తో కలిసి పోస్టర్ విడుదల జరిగింది.