మన చేతుల్లోనే మన ఆరోగ్యం

మన చేతుల్లోనే మన ఆరోగ్యం
కనిగిరి అక్టోబర్ 15 (న్యూస్ మేట్) : 15/10/20ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని గుడ్ హెల్ప్ సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో గురువారం స్థానిక సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల లో హెడ్మీస్ట్రీస్ సిస్టర్ ఝాన్సీ దయ మేరీ అద్యక్షతన కార్యక్రమము జరిగింది. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో అవగాహన కల్గించడం జరిగింది.కార్యక్రమంలో పోల్గోన్న డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మన చేతుల్లోనే మన ఆరోగ్యం దాగి ఉందని చేతులను శుభ్రంగా కడుక్కోవడం సులభమైన ముఖ్యమైన అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆరోగ్య భద్రత అని మన ఆచార సంప్రదాయాలు ప్రకారం ఆహారం స్వీకరించే సమయంలో కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని పూర్వం మనపెద్దలు అందుకే ఈ నియమం పెట్టారని మన శరీరానికి కావాల్సిన ఆహారం చేతుల ద్వారానే స్వీకరిస్తాం. ఆహారం తీసు కున్నప్పుడు చేతులు పరిశుభ్రంగా లేకపోతే వాటి ద్వారా సూక్ష్మక్రిములు ఒంట్లో ప్రవేశించి తద్వారా జీర్ణాశయంలోనికి ప్రవేశించి ప్రాణాంతకమైన వ్యాధులను కలుగచేస్తాయని పైగా చిన్నారులు సులభంగా నివారించగల వ్యాధులు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఐ.సి.డి.ఎస్ ప్రోజెక్ట్ అసిస్టేంట్ గంధం సామ్యేల్ గెర్షోమ్ మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా సుమారు 50 పైగా అతిసార సంబంధ వ్యాధులు, 20 నుంచి 30 శ్వాస సంబంధిత వ్యాధులు నివారించవచ్చు.కేవలం 15 నుంచి 20 సెకన్లపాటు సబ్బు చేతిలో ఉండేవిధంగా చేతిలోని అన్ని భాగాలను శుభ్రపరిచేవిధంగా చేయడం ద్వారా వ్యాధులు దరిచేరవు అని నీటిలో చేతులను తడిపి, సబ్బు లేదా లిక్విడ్‌ రెండు చేతులు మధ్య, వేళ్ళ వెనుకబాగంలో, గోళ్ళ సందులలో గట్టిగా రుద్దుతూ శుభ్ర పరుచుకోవాలని చేతులు శుభ్రపరుచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని తెలిపారు. రెడ్ క్రాస్ వాలంటీర్ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ దైనందిన జీవనంలో చేతుల శుభ్రత అత్యంత ముఖ్యమైనదని ఈ క్రమంలో యునిసెఫ్‌ చేతుల శుభ్రతపై అవగాహన కోసం ఏటా అక్టోబర్‌ 15వ తేదీని ‘అంతర్జాతీయ చేతుల శుభ్రత దినోత్సవం’గా పాటిస్తోందని . 2020 ఏడాదిని సార్వత్రిక చేతుల శుభ్రతను సాధించాలనే నినాదంతో ఆరోగ్య శాఖ మరియు ఇతర శాఖల సహకారంతో గుడ్ హెల్ప్ సంస్థ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రస్తుతం కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న పరిస్థితుల్లో చేతుల శుభ్రత మరింత ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు చిన్నిగారి మధు , ఆరోగ్య శాఖ నుండి మస్తాన్ , పి.టి.ల్.యు జిల్లా కార్యదర్శి టి.విజయ్ కుమార్ ఉపాధ్యాయులు, విధ్యార్ధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *