పొదిలి ఆంధ్ర అక్షర రిపోర్టర్ పై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని కోరుతూ అడిషనల్ ఎస్పీ కి వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు
ఒంగోలు అక్టోబర్ 15 (న్యూస్ మేట్) : పొదిలి లో ఆంధ్ర అక్షర రిపోర్టర్ మచ్చ రమణయ్య పై దాడి చేసిన శ్రావణి వెంకటేశ్వర్లు, దమ్మాలపాటి పాపారావు లపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద డిఆర్ ఓ లను కలిసి జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. అధికారులను కలిసిన వారిలో ఆంధ్ర అక్షర బ్యూరో ఇన్చార్జ్ కె.పూర్ణచంద్రరావు, న్యూస్ 99 తెలుగు దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ సామంతపూడి పరమేశ్వరరావు, ఎంపీ టీవీ చైర్మన్ పేరుసోముల శ్రీనివాస్, పొదిలి టీవీ 4 రిపోర్టర్ షేక్ కాలే షా, పొదిలి టైమ్స్ రిపోర్టర్ సిహెచ్ విజయ్ కుమార్ ఎంపీ టీవీ ఎండి వై మాచర్ల, ఆంధ్ర అక్షర జిల్లా క్రైమ్ రిపోర్టర్ కె. పవన్ కుమార్, చీమకుర్తి ఆంధ్ర అక్షర రిపోర్టర్ సిహెచ్ విష్ణు ఉన్నారు.