భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం

భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం

కొండపి అక్టోబర్ 15 (న్యూస్ మేట్) : భారత దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి మాజీ రాష్ట్రపతి డా ఏ పి జె అబ్దుల్ కలాం అని డిబిఎంఎస్ అధ్యక్షులు కొండ్రు కోటయ్య అన్నారు రు అబ్దుల్ కలాం 89 వ జయంతి వేడుకలు గురువారం కొండపి DBMS కార్యాలయంలో DBMS అధ్యక్షులు శ్రీ కోండ్రు కోటయ్య అధ్యక్షతన జరిగాయి అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం DBMS అధ్యక్షులు శ్రీ కోండ్రు కోటయ్య అబ్దుల్ కలాం గురించి మాట్లాడారు.డా.ఏ. పి. జె. అబ్దుల్ కలాం గారు పేదల పాలిట పెన్నిధి అని, భవన నిర్మాణ కార్మికులు కొరకు నిధులను కార్మికులకు అందే విధంగా అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని , తల్లి ఆషియమ్మ, గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసేవారు అని ఆయన కొనియాడారుపాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు , ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ “కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను” ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయారు.డా. ఏ. పి. జె. అబ్దుల్ కలాం గారి జీవితం ఎంతో స్ఫూర్తి దాయకం అని యువత తప్పు దారులు పట్టకుండా డా. ఏ. పి. జె. అబ్దుల్ కలాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు DBMS కార్యకర్తలు కొండపి నియోజకవర్గ యూత్ కమిటీ కార్యదర్శి టి. రాంబాబు మండల కార్యదర్శి డి. ఏసోబు ఎం. సుబ్బయ్య , CH. కోటేశ్వరరావు ,బ్రహ్మయ్య గారు, కె. మాణిక్యారావు U. బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *