రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే పతనం తప్పదు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే పతనం తప్పదు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

మార్కాపురం అక్టోబర్ 15 (న్యూస్ మేట్) : 15/10/20ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని కోరకుండా రైతుని నట్టేట ముంచే విధానాలు అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గురువారం మార్కాపురం ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈనాడు అధికారంలో కొనసాగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరిచే సంస్కరణలు తీసుకు రావడంతో పాటు రైతన్నకు గుది బండ లాంటి సంస్కరణలు ప్రవేశ పెడుతున్నారని విమర్శించారు .దేశానికి వెన్నెముక అయిన రైతు కంట కన్నీరు పాలకులకు అరిష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .పాలకుల తీరుపై దేశవ్యాప్తంగా రైతన్నలు తిరుగుబాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. నేడు అధికారంలో కొనసాగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్య బట్టారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ సైదా, రైతు నాయకులు చుండూరి రంగారావు, ఆర్ వెంకయ్య, నర్సింగరావు, సిపిఐ నాయకులు అందే నాసరయ్య సిపిఎం నాయకులు గాలి వెంకట్రాంరెడ్డి , సోమయ్య తదితరులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *