.వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పాత కూరగాయల మార్కెట్ అభివృద్ధి పట్టని పాలకులు
ఒంగోలు అక్టోబర్ 15 (న్యూస్ మేట్) : ఒంగోలు నగరంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాత కూరగాయలు మరియు చేపలు ,మటన్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది .కాలానుగుణంగా నగర జనాభా పెరడగం వలన మార్కెట్ సరిపోయేది కాదు. అందువలన ఊరచెరువు లో కొంత స్ధలంలో కూరగాయల మార్కెట్ చేపల మార్కెట్ మటన్ ,చికెన్ కు వేరుగా నిర్మాణం జరిగింది. అయితే 100 సంవత్సరాల చరిత్ర గల పాత మార్కెట్ మాత్రం ఎందుకు ఉపయోగం లేకుండా చెత్త డంపింగ్ , ముళ్ళ చెట్లు పెరిగి ఉంది .నగర పాలక సంస్థ మాత్రం ఇలాంటి ఖాళీ స్ధలాలను ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే చాలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గడచిన వాటి జోలికి నామకే వాస్తుగా ప్రయత్నం చేస్తారు .ఎన్నో ప్రభుత్వా లు మారిన ఉన్నతాధికారులు మారినా దీనిమీద ఎవరు కూడ నగర ప్రజలకు ఉపయోగపడే విధంగా అలాగే నగర పాలక సమస్ధకి ఆదాయం వచ్చే విధంగా నగరంలో చాలామంది నిరుద్యోగులకు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చెయ్యగలిగితే బాగుంటుంది .లేకపోతే నగరంలో ఎలక్ట్రానిక్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి వారికి ఇచ్చిన చాల మంది జీవనోపాధి కలిగించిన వారు అవుతారు . ఇప్పుడు నగరంలో మరోకటి డంపింగ్ కేంద్రం గా తయ్యార్ అయింది .గతంలో చాల సార్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు .లేకపోతే నగరంలో అందమైన ప్రాంతంగా ఉండవలసిన ప్రాంతం చీకట్లో చుట్టు ప్రక్కల వారికి మరుగుదొడ్లు గా , డంపింగ్ కేంద్రంగా ఉంది .ఇక్కడ ఖాళీ స్ధలం అభివృద్ధి చెయ్యక పోవడం వలన చుట్టు ప్రక్కల ఏరియా కూడ అభివృద్ధి జరగడం లేదు ఎక్కడ కూడ ప్రణాళికా బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగక మురికి ప్రాంతగా ఉంటుంది .ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడాలి .లేకపోతే నగరం అభివృద్ధి ,నగర పాలక సంస్థ కూడ ఆదాయం కోల్పోయే పరిస్థితి వస్తుంది . మంత్రి బాలినేని శ్రీ నివాసులు రెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు మాగుంట నివాసులు రెడ్డి ఇద్దరూ కలిసి దీని మీద ఆలోచన చేయ్యాలని ఈ ఖాళీ స్ధలంలో నగర ప్రజలకు ఉపయోగ పడే విధంగా నిర్మాణం చేయ్యాలని నగర ప్రజలు కోరుతున్నారు.