సామాజిక దృక్పథంతో ప్రజలకు సేవలు అందించండి… ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.

సామాజిక దృక్పథంతో ప్రజలకు సేవలు అందించండి… ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.16/10/20

వలేటివారిపాలెం అక్టోబర్ 16 (న్యూస్ మేట్): సామాజిక దృక్పథంతో ప్రభుత్వ ఫలాలను పేదలకు అర్హులైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చుండి గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఎంపీడీవో రఫిక్ అహ్మద్ అధ్యక్షతన దిశానిర్దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ప్రభుత్వం అనుకున్న లక్ష్యసాధనలో సచివాలయ సిబ్బంది 70 శాతం లక్ష్యాలను చేరుకోగా 30 శాతం వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవగాహన సేవా దృక్పథంతో 2వ సంవత్సరంలో సమస్యలు ఉత్పన్నం పునరావృతం కాకుండా 100 శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు గ్రామంలోని పెద్దల సలహాలు సూచనలను తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలను అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. మండల స్థాయి అధికారులు క్షేత్ర పరిశీలనను మరచి గణాంకాలను సచివాలయ వ్యవస్థ ద్వారా చెప్పించుకోవడం తగదని అన్నారు. సచివాలయ వ్యవస్థ లో ప్రతి సేవకు నిర్దిష్ట రుసుమును నిర్దిష్ట కాలపరిమితి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని అన్నారు. సేంద్రీయ వ్యవసాయ విధానం పై రైతులకు అవగాహన కల్పించడం లేదని దీనితో ప్రభుత్వ ఫలాలు రైతులు పొందడం లేదని అన్నారు. అనంతరం సచివాలయ సిబ్బంది శాఖాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆయా శాఖల అధికారులు సమస్యలకు వివరణ ఇచ్చారు. అనంతరం సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కేక్ ను ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కట్ చేశారు.గ్రామ సచివాలయ వ్యవస్థ లో ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా మెమొంటో ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా శాఖల అధికారులు, వైసిపి నాయకులు బ్రహ్మారెడ్డి,ఇరపని సతీష్, అంజయ్య, పులిగుంట మాల్యాద్రి, యానాది, సంజీవరెడ్డిి, మర్రి అంజయ్య, తిరుపతి రెడ్డిి, సుధాకర్, వేణుగోపాల రెడ్డి, ప్రగడ వెంకటేశ్వర్లు, కుమ్మరి మాల్యాద్రి, డేగ వెంకటేశ్వర్లు ( బుజ్జి ), వీరాస్వామి, కట్టా హనుమంతరావు, గురజాల కృష్ణయ్య, గోపి, అనుమోలు వెంకటేశ్వర్లు, అనుమోలు లక్ష్మీనరసింహం, మన్నం వెంకట రమేష్, స్వర్ణ మాలకొండయ్య, నరసయ్య తదితర వైసిపి నాయకులు, సచివాలయ సిబ్బంది,వలంటీర్లు పాల్గొన్నారు.16/10/20

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *